జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా

  • ఆధ్యాత్మిక చింతనతో హైదరాబాద్‌కు వచ్చినట్లు వెల్లడి
  • తన పర్యటనలో రాజకీయ కోణం లేదన్న వాద్రా
  • దేశంలో మహిళలకు భద్రత పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్య
ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆధ్యాత్మిక భావనలతోనే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయపరమైన కోణం లేదన్నారు.

దేశంలో మహిళల భద్రత పెద్ద సమస్యగా మారిందన్నారు. తన భార్య, కూతురు భద్రతపై కూడా ఆందోళనగా ఉందన్నారు. మహిళలతో ఎలా నడుచుకోవాలో ఇళ్లలో నేర్పించాలని సూచించారు. 

తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనుందని, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నానని వెల్లడించారు.

తెలంగాణలో అన్ని ప్రాంతాలకు వెళ్లి, అందరినీ కలుస్తానన్నారు. 'ఎమర్జెన్సీ' సినిమాపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రాజకీయ వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తాను తెలంగాణలో మందిర్‌కు వెళతానని, మసీదుకు కూడా వెళతానని చెప్పారు.

Robert Vadra
Jubilee Hills
Peddamma Thalli
Congress

More Telugu News